Pawan Kalyan: రామ్ చరణ్ ఆయుధాలు అవే: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Ram Charan a lovely birthday
  • నేడు రామ్ చరణ్ పుట్టినరోజు
  • ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • స్నేహపూర్వకంగా మెలిగే రామ్ చరణ్ మరెంతో ఎదగాలని ఆకాంక్ష
  • తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని కచ్చితంగా ఎగరేస్తాడని వెల్లడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ బాబాయి, టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక సందేశం వెలువరించారు. స్నేహపూర్వకంగా మెలిగే రామ్ చరణ్ మరెంతో ఎదగాలి... అందరి మన్ననలు పొందాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

"అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కు క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. భవిష్యత్తులో కచ్చితంగా మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను" అని పవన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసి, హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు.
Pawan Kalyan
Ram Charan
Birthday
Wishes
Janasena
Tollywood

More Telugu News