Samantha: నేను భయపడ్డాను .. కానీ అల్లు అర్హ భయపడలేదు: సమంత

Samanta Interview

  • సమంత నుంచి రానున్న 'శాకుంతలం'
  • ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న సినిమా 
  • ప్రమోషన్స్ లో పడిన సమంత
  • ఈ పాత్రను చేయడానికి భయపడ్డానని వెల్లడి 
  • అల్లు అర్హ నటన గొప్పగా ఉంటుందని వ్యాఖ్య


సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైంది. గుణశేఖర్ దర్శక నిర్మాతగా ఉన్న ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర' కోసం సమంతను సుమ ఇంటర్వ్యూ చేసింది. 

సమంత మాట్లాడుతూ .. "గుణశేఖర్ గారు ఈ కథతో వచ్చి కలిసినప్పుడు .. నేను చేయనని చెప్పాను. ఎందుకంటే లుక్ పరంగా .. పాత్ర స్వభావం పరంగా శకుంతలగా మెప్పించడం చాలా కష్టమైన విషయం .. అందుకే భయపడ్డాను. భయాన్ని దాటడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే ఆ తరువాత ఒప్పుకున్నాను. శకుంతలగా నన్ను నేను మలచుకోవడానికి కొంత సమయం తీసుకున్నాను" అని చెప్పారు. 

"ఈ సినిమాలో బాల భరతుడు పాత్రను అల్లు అర్హ పోషించింది. అర్హకు పేరెంట్స్ మంచి తెలుగు నేర్పించారు. తాను పూర్తిగా స్పష్టమైన తెలుగులోనే మాట్లాడుతుంది. సెట్లో ఎంతమంది ఉన్నప్పటికీ భయపడదు. పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పేసింది. తను డైలాగ్స్ చెబుతుంటే నాకు ఇంకా క్యూట్ గా అనిపించింది" అని చెప్పుకొచ్చారు. 

Samantha
Dev Mohan
Allu Arha
Shaakuntalam Movie
  • Loading...

More Telugu News