Jagananna Smart Township: జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లపై సీఆర్డీఏ కీలక ప్రకటన

CRDA announcement on Jagananna Smart Townships

  • స్మార్ట్ టౌన్ షిప్ లు అభివృద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వం
  • ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు స్మార్ట్ టౌన్ షిప్ లలో 10 శాతం ప్లాట్లు
  • 20 శాతం రాయితీతో కొనుగోలు చేసే అవకాశం

ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లపై సీఆర్డీఏ కీలక ప్రకటన చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్లాట్లు కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు కేటాయించినట్టు వివరించింది. 

ఎంఐజీ లే అవుట్ లో 200 చదరపు గజాల ప్లాట్లు 58 ఉన్నాయని, 240 చదరపు గజాల ప్లాట్లు 188 ఉన్నాయని తెలిపింది. సీఆర్డీఏ తాజా ప్రకటన నేపథ్యంలో, జగనన్న లే అవుట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీతో ప్లాట్లు అందిస్తారు.

Jagananna Smart Township
CRDA
Plots
Govt Employees
Andhra Pradesh
  • Loading...

More Telugu News