Nara Rohit: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఏమన్నారంటే..?

Nara Rohit comments on Junior NTR political entry
  • లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న నారా రోహిత్
  • రాబోయే రోజుల్లో పాదయాత్ర దుమ్మురేపుతుందని వ్యాఖ్య
  • అవసరమైనప్పుడు తారక్ రాజకీయాల్లోకి వస్తారన్న రోహిత్
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సినీ హీరో నారా రోహిత్ సంఘీభావం ప్రకటించారు. రోహిత్ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో యువగళం పాదయాత్ర దుమ్ము రేపుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలిందని, ఆ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడిందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎదురైన ప్రశ్నకు సమాధానంగా... అవసరమైనప్పుడు తారక్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర ఇప్పటి వరకు 625 కిలోమీటర్ల మేర కొనసాగింది.
Nara Rohit
Nara Lokesh
Junior NTR
Telugudesam

More Telugu News