Rains: ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు!

Light Rains Expected in Andhrapradesh for Three days
  • నేటి నుంచి శుక్రవారం వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
  • సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి
  • నిన్న కూడా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు ద్రోణి కొనసాగుతుండడమే ఇందుకు కారణం. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావంతో నిన్న అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

అలాగే, నేటి నుంచి శుక్రవారం వరకు అంటే మరో మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
Rains
Andhra Pradesh
Rayala Seema
Coastal Andhra

More Telugu News