Roja: ప్రజలంతా మళ్లీ జగనే రావాలని కోరుకుంటున్నారు: రోజా

Roja fires on TDP

  • 2019 నుంచి ఒక్క ఎన్నికలో కూడా గెలవకపోవడంతో టీడీపీ నేతలు పిచ్చెక్కిపోయారన్న రోజా
  • మూడు ఎమ్మెల్సీలు గెలిస్తే ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీలవుతున్నారని విమర్శ
  • శవాల నోట్లో తీర్థం పోసినట్టుగా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని ఎద్దేవా

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. 2019లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఒక్క ఎన్నికలో కూడా టీడీపీ గెలవలేదని... దీంతో, ఆ పార్టీ నేతలు పిచ్చెక్కిపోయారని అన్నారు. శవాల నోట్లో తీర్థం పోసినట్టుగా టీడీపీకి ఊహించని విధంగా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఆ ఎమ్మెల్సీలు పార్టీ సింబల్ తో, సొంత ఓట్లతో గెలవలేదని చెప్పారు. అయినా ఏదో ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. టీడీపీ నేతలు అహంకారం నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి, ఆయనపై దాడి చేయడం దారుణమని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

Roja
Jagan
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News