Chandrababu: ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండ్రోజుల ముందే చెప్పారు: చంద్రబాబు

Chandrababu criticizes YCP Govt

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్
  • మూడు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులదే విజయం
  • రాంగోపాల్ రెడ్డిది ప్రజావిజయం అన్న చంద్రబాబు
  • రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని వెల్లడి

ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలవడంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డి గెలుపు ప్రజావిజయం అని అభివర్ణించారు. ప్రజాతీర్పును ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలని పేర్కొన్నారు. 

రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని చంద్రబాబు వివరించారు. చైతన్యం, బాధ్యతతో వచ్చి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారని తెలిపారు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండ్రోజులు ముందే చెప్పారని చంద్రబాబు చమత్కరించారు. 

ఈ నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన చేశారని విమర్శించారు. జగన్ ఎన్నికల్లో మళ్లీ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జగన్ బాధ్యతలేని వ్యక్తి అని, మోసాలు చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, టీడీపీది జనబలం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ది ధనబలం అని, రౌడీయిజం చూపిస్తున్నాడని... ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. 

జగన్ అక్రమాలను నమ్మి వాటితోనే ముందుకు వెళుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెట్టి వేధించారని తెలిపారు.

  • Loading...

More Telugu News