tdp: ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ.. ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సి వుంది: చంద్రబాబు

chandrababu naidu fires on cm ys jagan
  • తమ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా చేశారన్న బాబు
  • గెలిచిన అభ్యర్థికి ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అరెస్టు చేయిస్తావా అని మండిమాటు
  • పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై కొనసాగుతున్న ఉత్కంఠ  
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గెలిచిన అభ్యర్థికి ధృవీకరణ పత్రం ఇవ్వకుండా, అరెస్టు చేయిస్తావా? అంటూ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా?. పులివెందుల టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?. ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టు పట్టించాల్సివుంది. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

రాంగోపాల్ రెడ్డిని రాత్రి కౌంటింగ్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసిన వీడియో‎ను షేర్ చేశారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపుపై ఇంకా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో..అర్థరాత్రి కౌంటింగ్‌ కేంద్రం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన రాంగోపాల్‌రెడ్డి, పరిటాల సునీత, శ్రీరామ్‌, కాల్వ సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
tdp
Chandrababu
YSRCP
YS Jagan
Andhra Pradesh
mlc election

More Telugu News