Prakash Raj: 'ఉగాది'కి పోటీపడుతున్న సినిమాలివే!
![Ugadi New Movies Update](https://imgd.ap7am.com/thumbnail/cr-20230318tn64157ffa4b422.jpg)
- ఉగాదికి విడుదలవుతున్న 'రంగ మార్తాండ'
- అదే రోజున వస్తున్న 'దాస్ కా ధమ్కీ'
- బరిలోనే ఉన్న 'కోస్టీ' ... 'గీత సాక్షిగా'
- మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్
'ఉగాది' అనగానే కొత్త ఏడాది మొదలు అనే ఒక సెంటిమెంట్ చాలామందిలో ఉంటుంది. అందువలన ఆ రోజున తమ సినిమాలకి సంబంధించిన పోస్టర్లు .. టీజర్లు .. ట్రైలర్లు వదులుతూనే ఉంటారు. అలా ఆ రోజున సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఆల్రెడీ విడుదలకి ముస్తాబైన సినిమాలను బరిలోకి దింపేస్తూ ఉంటారు. అలా ఈ నెల 22వ తేదీన థియేటర్లకు వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతుండటం విశేషం.
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగ మార్తాండ' ఉగాది రోజునే విడుదలవుతోంది. ఆ రోజున వస్తున్న వాటిలో ఇదే పెద్ద సినిమా అనుకోవాలి. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాపై మంచి బజ్ కనిపిస్తోంది.
![](https://img.ap7am.com/froala-uploads/20230318fr64157fdd1ba16.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230318fr64157fed6493c.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20230318fr64157ff6c5a06.jpg)