Vishwak Sen: నాకు సపోర్టుగా ఎన్టీఆర్ ను ఆ దేవుడే పంపించాడు: విష్వక్సేన్

Das Ka Dhamki Pre Release Event

  • శిల్పకళావేదికలో 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ 
  • ఆయన ఇండియాలో బెస్ట్ యాక్టర్ అంటూ విష్వక్ కితాబు
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల

విష్వక్సేన్ హీరోగా 'దాస్ కా ధమ్కీ' సినిమా రూపొందింది. ఆయనే దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో, కథానాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ - 'శిల్పకళావేదిక'లో జరిగింది. 

ఈ స్టేజ్ పై విష్వక్సేన్ మాట్లాడుతూ .. "ఈ రోజున ఎన్టీఆర్ ఇక్కడికి విష్వక్సేన్ కోసం రాలేదు. నేను ఆయనకి అభిమానిని. అభిమానులందరినీ నాలో చూసుకుని ఆయన ఇక్కడికి వచ్చారు. ఒకసారి ఆయన తన ఇంటికి ఆహ్వానించి ఎంతో ఆత్మీయంగా భోజనం పెట్టి పంపించారు. నేను కారులో బయల్దేరుతూ, 'దాస్ కా ధమ్కీ' సినిమా ఫంక్షన్ కి రావాలని అడిగాను. వస్తానని అప్పుడే ఆయన మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు. 

"ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అని నేను ఎప్పుడో చెప్పాను. ఇంతవరకూ ఎన్టీఆర్ లో మనం చూసింది టీజర్ మాత్రమే .. అసలు సినిమా ముందుంది. దేవుడు నాకు సపోర్టుగా ఎన్టీఆర్ ను పంపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమనేది ఇక్కడి నుంచే మొదలైంది. మళ్లీ మీ అందరినీ సక్సెస్ మీట్లో కలుస్తాను. 22వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు. 

Vishwak Sen
Niveda Pethuraj
Das Ka Dhamki
  • Loading...

More Telugu News