Swapnalok Complex: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం

Fire accident in Secunderabad Swapnalok Complex

  • మూడో అంతస్తులో ఎగసిపడుతున్న మంటలు
  • ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • మూడో అంతస్తులో కొందరు చిక్కుకుపోయినట్టు సమాచారం
  • జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోనూ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడో అంతస్తులో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో భయానక వాతావరణం ఏర్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. కాగా, మూడో అంతస్తులో కొందరు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. చిక్కుకుపోయిన వారు సిబ్బంది అయ్యుంటారని భావిస్తున్నారు. 

అటు, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోనూ అగ్నిప్రమాదం జరిగింది. కోపల్లే ఫార్మా ఇండస్ట్రీ వద్ద సాల్వెంట్ డ్రమ్ములు గాల్లోకి ఎగురుతూ పెద్ద శబ్దంతో పేలుతుండడంతో పరిసరాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని జనప్రియ, మోదీ అపార్ట్ మెంట్ వాసులు హడలిపోతున్నారు.

Swapnalok Complex
Fire Accident
Secunderabad
Hyderabad
  • Loading...

More Telugu News