Rahul Gandhi: నాకు ఆ అవకాశమే ఇవ్వడం లేదు: రాహుల్ గాంధీ

Not allowed to respond to BJP charges in Parliament Rahul Gandhi says

  • లండన్ లో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత
  • పార్లమెంట్ లో తనపై మంత్రులు పలు ఆరోపణలు చేశారన్న రాహుల్
  • సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని చాంబర్ కు వెళ్లి స్పీకర్ ను కోరినట్టు వెల్లడి

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా.. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు పార్లమెంట్ లో తనకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ రోజు లోక్ సభకు హాజరైన తర్వాత రాహుల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను పార్లమెంటు సభ్యుడినని, పార్లమెంటులో తన వాదన వినిపించేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

‘ఈ విషయంలో నా వాదన వినిపించాలని నేను పార్లమెంట్ కు వెళ్లాను. నలుగురు మంత్రులు పార్లమెంట్‌లో నాపై ఆరోపణలు చేశారు. సభా వేదికపై మాట్లాడేందుకు అనుమతి పొందడం నా హక్కు. నాకు అవకాశం ఇవ్వాలని ఈ రోజు స్పీకర్‌ని అభ్యర్థించాను. నేను మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆయన ఛాంబర్‌కి వెళ్లి చెప్పాను. బీజేపీకి చెందిన పలువురు నాపై ఆరోపణలు చేశారని, వాటికి సమాధానం ఇచ్చేందుకు సభలో మాట్లాడటం ఒక పార్లమెంటు సభ్యునిగా నా హక్కు అని చెప్పాను. కానీ, స్పీకర్ సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. కానీ మాట్లాడటానికి రేపు అనుమతిస్తారని ఆశిస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News