చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎటువైపు వస్తుందో తెలియదు: 'కస్టడీ' టీజర్ డైలాగ్!
- చైతూ హీరోగా రూపొందిన 'కస్టడీ'
- రెండోసారి ఆయన జోడీకట్టిన కృతి శెట్టి
- వెంకట్ ప్రభు నుంచి వస్తున్న ద్విభాషా చిత్రం ఇది
- మే 12వ తేదీన సినిమా విడుదల
మే 12 వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. 'ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు. నిజం ఒక ధైర్యం .. నిజం ఒక సైన్యం .. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది' అనే హీరో డైలాగ్ సినిమాపై ఆత్రుతను పెంచుతోంది.
చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.