snow leopard: లడఖ్ లో మంచు చిరుత వేట.. వీడియో వైరల్

snow leopard appeared in ladakh

  • ట్విట్టర్ లో వీడియోను షేర్ చేసిన ‘ది వైల్డ్ ఇండియా’ అనే యూజర్
  • పర్వతం పైభాగం నుంచి దూసుకొచ్చి మేకను వేటాడిన చిరుత
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

లడఖ్ లో మంచు చిరుత కనిపించింది. పర్వత మేకలను వేటాడుతూ దర్శనమిచ్చింది. ఈ క్షణాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పర్వత మేకలను వేటాడుతున్న చిరుత వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పర్వతం పైభాగంలో ఉన్న చిరుత.. గడ్డి తింటున్న మేకలను చూసింది. అత్యంత వేగంతో కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మూడు మేకల్లో రెండు తప్పించుకోగా.. ఒకటి కిందపడి దొరికిపోయింది. దాన్ని నోట కర్చుకుని చిరుత తీసుకెళ్లిపోయింది. 

‘ది వైల్డ్ ఇండియా’ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ నెల 13న పులి వేటాడినట్లు పేర్కొన్నారు. కాగా, మంచు చిరుతలను పర్వతాల దెయ్యం అని కూడా పిలుస్తారు. ఇవి హిమాలయాల్లో మంచుతో కప్పుకుపోయిన శిఖరాల్లో నివసిస్తాయి. అత్యంత అరుదుగా కనిపిస్తాయి.

snow leopard
Ladakh
snow leopard hunting
Ghost of the mountains

More Telugu News