Nani: ఆ సంఘటనతో నాకు రెండు నెలల పాటు నిద్రపట్టలేదు: నాని

Nani Interview

  • 'దసరా'తో పలకరించనున్న నాని
  • బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే కథ 
  • ఆ సీన్ చాలా కష్టంగా అనిపించిందన్న నాని 
  • ఈ నెల 30వ తేదీన థియేటర్లకి వస్తున్న సినిమా 

బొగ్గు గనుల నేపథ్యంలో నాని 'దసరా' సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో నాని పూర్తి మాస్ లుక్కుతో కనిపించనున్నాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నాని ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగు సందర్భంగా తనని కంగారు పెట్టేసిన ఓ సంఘటనను గురించి ప్రస్తావించాడు.

"డంపర్ ట్రక్ కోల్స్ ను తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. ఆ డంపర్ ట్రక్ లో నుంచి నేను కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. సింథటిక్ బొగ్గు రెడీ చేశారు .. డస్ట్ తోనే అవి ఉంటాయి. ఆ డంపర్ లో నుంచి నేను క్రింద పడిపోయాను. సింథటిక్ కోల్స్ క్రింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్ లో నేను గాలి పీల్చకుండా ఉండలేను .. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది.   

ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు.. డంప్ లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం .. బొగ్గు నాపై పడటం .. నన్ను పైకి లాగడం .. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. అది క్లియర్ కావడానికి చాలా సమయం పట్టింది. ఆ కారణం వలన రెండు నెలల పాటు నిద్రపట్టలేదు" అని చెప్పాడు. 

Nani
Keerthi Suresh
Dasara Movie
  • Loading...

More Telugu News