Andhra Pradesh: సంక్షేమానికే పెద్దపీట.. ఏపీ బడ్జెట్ హైలైట్స్ - 1

Andhra Pradesh budget

  • అమ్మ ఒడికి - రూ. 6,500 కోట్లు
  • జగనన్న విద్యా దీవెనకు - రూ. 2,841.64 కోట్లు
  • వైఎస్సార్ ఆసరాకు - రూ. 6,700 కోట్లు

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమానికే బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. 

బడ్జెట్ హైలైట్స్:

  • రెవెన్యూ వ్యయం - రూ. 2,28,540 కోట్లు
  • రెవెన్యూ లోటు - రూ. 22,316 కోట్లు
  • మూలధన వ్యయం - రూ. 31,061 కోట్లు
  • ద్రవ్య లోటు - రూ. 54,587 కోట్లు
  • జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం
  • జగనన్న విద్యా దీవెనకు - రూ. 2,841.64 కోట్లు
  • జగనన్న వసతి దీవెన - రూ. 2,200 కోట్లు
  • వైఎస్సార్ రైతు భరోసా - రూ. 4,020 కోట్లు
  • వైఎస్సార్ పెన్షన్ కానుక - రూ. 21,434.72 కోట్లు
  • వైఎస్సార్ పీఎం బీమా యోజన - రూ. 1,600 కోట్లు
  • రైతులకు వడ్డీ లేని రుణాలు - రూ. 500 కోట్లు
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు - రూ. 1,000 కోట్లు
  • వైఎస్సార్ వాహనమిత్ర - రూ. 275 కోట్లు
  • వైఎస్సార్ మత్స్యకార భరోసా - రూ. 125 కోట్లు
  • జగనన్న చేదోడు - రూ. 350 కోట్లు
  • మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ - రూ. 50 కోట్లు
  • లా నేస్తం - 17 కోట్లు
  • రైతు కుటుంబాలకు పరిహారం - రూ. 20 కోట్లు
  • వైఎస్సార్ నేతన్న హస్తం - రూ. 200 కోట్లు
  • ఈబీసీ నేస్తం - రూ. 610 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా - రూ. 6,700 కోట్లు
  • వైఎస్సార్ కల్యాణమస్తు - రూ. 200 కోట్లు
  • జగనన్న తోడు - రూ. 35 కోట్లు
  • వైఎస్సార్ చేయూత - రూ. 5,000 కోట్లు
  • అమ్మ ఒడి - రూ. 6,500 కోట్లు
  • ధర స్థిరీకరణ నిధి - రూ. 3 వేల కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణకు - 1,212 కోట్లు.

Andhra Pradesh
Budget Session
Buggana Rajendranath
  • Loading...

More Telugu News