Ram Gopal Varma: మా పెళ్లయిన మూడో రోజు నుంచే గొడవలు మొదలు: రామ్ గోపాల్ వర్మ

Varma Interview

  • తన పెళ్లి గురించి ప్రస్తావించిన వర్మ 
  • ప్రేమలో వున్నప్పుడు ఎవరూ బయటపడరని వ్యాఖ్య 
  • పెళ్లి తరువాత నిజాలు బైటికి వస్తాయని వెల్లడి
  • గొడవలు జరిగినప్పుడు పారిపోయేవాడినని వ్యాఖ్య

రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు తన పెళ్లి గురించిన ప్రస్తావన తెస్తూనే ఉంటారు. పెళ్లి పట్ల తనకి గల వ్యతిరేక భావాలను ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ .. "ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. పెళ్లి పేరుతో ఎప్పుడైతే ఒక రూఫ్ క్రిందికి వెళతామో అప్పుడు అన్నీ మారిపోతాయి .. అసలు రంగులు బయటికి వస్తాయి" అని అన్నారు. 

"నాకు .. రత్నకి పెళ్లి జరిగిన తరువాత కూడా నేను ఇంటి పట్టున ఉన్నది చాలా తక్కువ. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఒకసారి రత్న నా కాలర్ పట్టుకుని గోడకి అదిమి పట్టేసింది. అది చూసిన మా నాన్నగారు కంగారు పడిపోయి అరిచేశారు. నేను పెరట్లో నుంచి పారిపోయాను. రత్న ఎంతగా అరిచినా నేను పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని కాదు. ఒక మనిషి రియాక్ట్ కాకపోతే అవతల వ్యక్తికి మరింత కోపం వస్తుంది. 

అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ రావాలనే ఉద్దేశంతో ఫిజికల్ గా గొడవపడటానికి రెడీ అవుతారు. రత్న చేసింది కూడా అదే. అలాంటప్పుడు తప్పించుకోవడానికి నేను పారిపోయేవాడిని. ఒకసారి మా బిల్డింగ్ పై నుంచి మరో బిల్డింగ్ పైకి దూకేసి మరీ వెళ్లిపోయాను. ఆ రాత్రంతా బంజారా హిల్స్ రోడ్లపై తిరుగుతూ గడిపేశాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Ram Gopal Varma
Interview
Tollywood
  • Loading...

More Telugu News