Samantha: 'శాకుంతలం' చూశాను .. అది ఒక అద్భుతం: సమంత

Sakunthalan Movie Update

  • సమంత టైటిల్ రోల్ ను పోషించిన 'శాకుంతలం'
  • గుణశేఖర్ తీర్చిదిద్దిన దృశ్య కావ్యం 
  • సినిమా పట్ల సమంత సంతోషం .. సంతృప్తి 
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ  సినిమాను గురించి సమంత స్పందించారు. ఈ సినిమాను తాను చూశాననీ, అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఒక గొప్ప ఇతిహాసం జీవం పోసుకుందనీ, గుణశేఖర్ గారు తన హృదయానికి చాలా దగ్గరగా ఈ సినిమాను ఆవిష్కరించారని చెప్పారు. పిల్లలంతా కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ ను ప్రేమించడం ఖాయమనీ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ ను ఆస్వాదిస్తారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. 

"ఈ సినిమాకి సంబంధించి సాగిన జర్నీని ఎప్పటికీ మరిచిపోలేననీ, అందుకు కారణమైన దిల్ రాజుగారికీ, నీలిమ గుణ గారికి థ్యాంక్స్ చెబుతున్నానని .. ఈ సినిమా ఎప్పటికి తనకి దగ్గరగానే ఉండిపోతుందని అన్నారు. సమంత స్పందించిన తీరు ఈ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచడం ఖాయమనే చెప్పాలి. దేవ్ మోహన్ .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రలను పోషించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలవనుంది.

Samantha
Dev Mohan
Mohan Babu
Prakash Raj
Sakuntalam Movie
  • Loading...

More Telugu News