Nimmala Rama Naidu: జగన్ పని అయిపోయింది: నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu fires on Jagan

  • జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్న నిమ్మల
  • భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపణ
  • పంచాయతీలను నిర్వీర్యం చేశారని విమర్శ

ఏపీలో జగన్ పని అయిపోయిందని... ఆయనకు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి చేసి ఉంటే, సంక్షేమ పథకాలను అమలు చేసి ఉంటే ఓట్లను ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి ఎక్కువ ఓటర్లు ఉన్నారని... అయినప్పటికీ భయంతో డబ్బు, తాయిలాలు పంచుతున్నారని చెప్పారు. ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Nimmala Rama Naidu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News