Telugu Student: అమెరికాలో కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందిన తెలుగు విద్యార్థి

Telugu student died in USA due to cardiac arrest
  • చిన్న వయసులోనే ప్రాణాలను తీసేస్తున్న గుండె
  • కార్డియాక్ అరెస్ట్ తో న్యూయార్క్ లో వంశీరెడ్డయ్య మృతి
  • గత ఆగస్ట్ లో యూఎస్ వెళ్లిన వంశీ
చిన్న వయసులోనే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ లతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బొడగల వంశీరెడ్డయ్య అనే విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడు. అతని వయసు 23 సంవత్సరాలు. న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ కాలేజీలో ఎంఎస్ చేసేందుకు గత ఆగస్టులో ఆయన యూఎస్ వెళ్లాడు. వంశీ తండ్రి లవకుమార్ తెలుగు దినపత్రిక 'ఆంధ్రజ్యోతి'లో చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Telugu Student
USA
Cardiac Arrest

More Telugu News