Team India: వెనక్కు తగ్గని ఖవాజా.. 400 దాటిన ఆసీస్ స్కోరు

australia reaches 400 runs

  • శతకంతో సత్తా చాటిన కామెరూన్ గ్రీన్
  • ఐదో వికెట్ కు ఖవాజా, గ్రీన్ 208 పరుగుల భాగస్వామ్యం
  • వెంటవెంటనే మూడు వికెట్లు తీసిన అశ్విన్

టీమిండియాతో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఉస్మాన్ ఖవాజ (171 బ్యాటింగ్) కామెరూన్ గ్రీన్ (114) సెంచరీతో చెలరేగడంతో ఇప్పటికే 400 పరుగుల మార్కు దాటింది. ట్రావిస్ హెడ్ (32), మార్నస్ లబుషేన్ (3), స్టీవ్ స్మిత్ (38), పీటర్ హ్యాండ్స్ కాంబ్ (17), అలెక్స్ క్యారీ (0) నిరాశ పరిచినా.. ఖవాజా, గ్రీన్ చెలరేగిపోయారు. ఐదో వికెట్ కు 208 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

ఎట్టకేలకు కీపర్ క్యాచ్ ద్వారా గ్రీన్ ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో అలెక్స్ క్యారీ (0)ని డకౌట్ చేసిన అశ్విన్ కాసేపటికే స్టార్క్ (0)ను పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ, టెయిలెండర్లతో కలిసి ఖవాజా స్కోరు 400 దాటించాడు. అతను డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.142 ఓవర్లకు ఆసీస్ 401/7 స్కోరుతో నిలిచింది. ఖవాజా 171 పరుగులతో ఉన్నాడు.

Team India
Australia
400
usman khawaja
  • Loading...

More Telugu News