WPL: డబ్ల్యూపీఎల్ లో నేడు సమవుజ్జీల పోరు

Delhi Capitals takes on Mumbai Indians in WPL

  • ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్
  • నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • టోర్నీలో చెరో రెండు మ్యాచ్ లు గెలిచిన ఢిల్లీ, ముంబయి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. 

ఈ టోర్నీలో ఢిల్లీ, ముంబయి జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఓటమి చవిచూడలేదు. టోర్నీలో ఇరుజట్లు తలపడడం ఇదే ప్రథమం. పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానంలో ఉండగా, రన్ రేట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ అమ్మాయిలు రెండోస్థానంలో ఉన్నారు. దాంతో ఇవాళ్టి మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. 

ముంబయి జట్టులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, నాట్ షివర్, అమేలియా కెర్ వంటి హేమాహేమీలు ఉండగా... యస్తికా భాటియా, ఇస్సీ వాంగ్, సాలికా ఇషాక్ కూడా రాణిస్తుండం అదనపు బలంగా మారింది. ఇక, ఢిల్లీ జట్టులో కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మరిజానే కాప్ ఫామ లో ఉన్నారు.

WPL
Delhi Capitals
Mumbai Indians
Toss
  • Loading...

More Telugu News