Bhadradri Kothagudem District: మూడేళ్లుగా ఇద్దరు అమ్మాయిలతో సహజీవనం.. ఇద్దరికీ సంతానం.. ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

Man Marries two brides in Bhadradi kothgudem dist
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • మరదలు, ప్రేమించిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన యువకుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన శుభలేఖ
ఒక్కడే వరుడు..ఇద్దరు వధువులను మనువాడాడు. ఈ విచిత్ర ఘటనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల వేదిక అయింది. ఇందుకు సంబంధించిన పెళ్లికార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇంటర్ చదువుతున్న సమయంలో దోశిలపల్లికి చెందిన స్వప్న కుమారిని ప్రేమించాడు. అదే సమయంలో కుర్నపల్లికి చెందిన తన మరదలు సునీతపైనా మనసు పారేసుకున్నాడు. 

ఒకరికి పాప.. మరొకరికి బాబు
సత్తిబాబు మూడేళ్లుగా ఇద్దరితోనూ సహజీవనం కొనసాగిస్తున్నాడు. స్వప్నకు పాప, సునీతకు బాబు పుట్టారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయి తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఇద్దరినీ పెళ్లాడతానని చెప్పాడు. దీంతో విషయం మూడు గ్రామాల పెద్దలకు చేరింది. వారు పంచాయితీ పెట్టారు. అమ్మాయిలు కూడా అతడిని పెళ్లాడేందుకు ఇష్టపడడంతో పెళ్లి నిశ్చయించారు. ఎర్రబోరు గ్రామంలో ఈ ఉదయం 7.04 గంటలకు ఇద్దరి మెడలో సత్తిబాబు తాళి కట్టాడు. 
Bhadradri Kothagudem District
Charla
Marriage
Offbeat News

More Telugu News