MRSAM: ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఎంఆర్ శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
- ఎంఆర్ శామ్ క్షిపణిని పరీక్షించిన భారత నేవీ
- నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిన వైనం
- యాంటీ షిప్ మిస్సైళ్ల అంతు చూసే ఎంఆర్ శామ్
- ఇజ్రాయెల్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన డీఆర్డీవో
ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్య శ్రేణి ఎంఆర్ శామ్ క్షిపణిని భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక నుంచి దూసుకెళ్లిన ఎంఆర్ శామ్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించింది. యాంటీ షిప్ మిస్సైళ్లను గగనతలంలోనే అడ్డుకోగల తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.
ఎంఆర్ శామ్ క్షిపణి... 70 కిలోమీటర్ల రేంజిలో శత్రుదేశాల యుద్ధ విమానాలను, అటాకింగ్ హెలికాప్టర్లను, క్రూయిజ్ మిస్సైళ్లను, బాంబర్ డ్రోన్లను ఇది తుత్తునియలు చేయగలదు. ఈ అత్యాధునిక క్షిపణిని డీఆర్డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేయగా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది.