Praveen Anumolu: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం... కెమెరామెన్ మృతి

Tollywood cameraman Praveen Anumolu passes away

  • కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూత
  • హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన ప్రవీణ్ 
  • సినిమాటోగ్రాఫర్ గా ఆయన తొలిచిత్రం 'దర్శకుడు' 

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ కెమెరామెన్ ప్రవీణ్ అనుమోలు కన్నుమూశారు. హార్ట్ అటాక్ కారణంగా నిన్న ఆయన మరణించారు. దీంతో, ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

పలు చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేసిన ప్రవీణ్... సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో పని చేసిన జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన 'దర్శకుడు' సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు. ఇప్పుడు ఆయన మరికొన్ని సినిమాలకు పని చేస్తున్నారు. కెమెరామెన్ గా బిజీ అవుతున్న తరుణంలో ఆయన కన్నుమూయడం విచారకరం. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Praveen Anumolu
Cameraman
Tollywood
  • Loading...

More Telugu News