Nabha Natesh: రోడ్డు ప్రమాదం కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయాను: నభా నటేశ్

Nabha Natesh talks about road accident
  • ఏడాది కిందట నభా నటేశ్ కు రోడ్డు ప్రమాదం
  • భుజం ఎముక విరిగిందన్న నభా
  • అనేక సర్జరీలు చేశారని వెల్లడి
  • బతుకుతానని అనుకోలేదని వ్యాఖ్యలు
టాలీవుడ్ యువ నటి నభా నటేశ్ ఏడాది కిందట రోడ్డు ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె తాత్కాలికంగా సినిమాలకు దూరమైంది. ఆ ప్రమాదం గురించి నభా నటేశ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆ రోడ్డు ప్రమాదం తనకు అనేక అవకాశాలను దూరం చేసిందని వెల్లడించింది. అయితే ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని భావించానని, అందుకే ఆ విషయం గురించి బాధపడడంలేదని తెలిపింది. 

అసలు, ఆ రోడ్డు ప్రమాదంలో తాను బతుకుతానని అనుకోలేదని, భుజం ఎముక విరిగిందని, అనేక ఆపరేషన్లు చేశారని వివరించింది. పూర్తిగా కోలుకోవడానికి ఏడాది కాలం పట్టిందని, ఇప్పుడు తాను శారీరకంగానూ, మానసికంగానూ బలంగా ఉన్నానని నభా నటేశ్ వెల్లడించింది. ఇటువంటి ఘటనల వల్ల మనల్ని ఎందరు ఇష్టపడుతున్నారో తెలుస్తుందని పేర్కొంది. 

ఇకపై తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు అంగీకరిస్తానని, తాను నటించిన కొన్ని సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలిపింది. నభా నటేశ్ తెలుగులో నన్ను దోచుకుందువతే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో నటించింది.
Nabha Natesh
Road Accident
Actress
Tollywood

More Telugu News