Jagan: ఎమ్మెల్యే ప్రసాదరాజు కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
![CM Jagan attends MLA Prasadaraju daughter wedding reception](https://imgd.ap7am.com/thumbnail/cr-20230305tn6404a38b84862.jpg)
- నరసాపురం ఎమ్మెల్యే ఇంట శుభకార్యం
- కలగంపూడి గ్రామంలో వివాహ రిసెప్షన్
- వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్ సింధు వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కలగంపూడి గ్రామంలో జరిగింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ నూతన వధూవరులకు శుభకాంక్షలు తెలిపారు. వారిని ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్ లో ఏపీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు కూడా పాల్గొన్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20230305fr6404a37f27e32.jpg)