RCB: డబ్ల్యూపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... టాస్ గెలిచిన ఆర్సీబీ

RCB won the toss against Delhi Capitals in WPL

  • నిన్న ప్రారంభమైన డబ్ల్యూపీఎల్
  • నేడు ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
  • మరో మ్యాచ్ లో యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్

భారత్ లో అట్టహాసంగా ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్)లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. 

కాగా, నేటి తొలి మ్యాచ్ కు ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు టీమ్ కు స్మృతి మంధన నాయకత్వం వహిస్తుండగా, సోఫీ డివైన్, హీదర్ నైట్, ఎలిస్ పెర్రీ, మేగాన్ షట్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. 

అటు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్ కాగా... ఆ జట్టులో జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, తానియా భాటియా వంటి టీమిండియా స్టార్లు ఉన్నారు.

RCB
Delhi Capitals
Toss
WPL
  • Loading...

More Telugu News