Ippatam Village: గుంటూరు జిల్లా ఇప్పటంలో మళ్లీ టెన్షన్... ప్రహరీ గోడల కూల్చివేతలు

Tension in Ippatam village as officials demolishing houses

  • రోడ్డు విస్తరణ పేరుతో ఆక్రమణల కూల్చివేతలు 
  • గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు
  • అధికారులపై మండిపడుతున్న గ్రామస్తులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అధికారులు మళ్లీ ఆక్రమణల పేరిట కూల్చివేతలు ప్రారంభించారు. అనుమతించిన ఇంటి ప్లాన్లను అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారని పేర్కొంటూ.. జేసీబీలతో 12 ఇళ్ల ప్రహరీ గోడల కూల్చివేతలను చేపట్టారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ కూల్చివేతలపై గ్రామస్తులు మండిపడుతున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో గతంలోనే కూల్చివేతలను అధికారులు చేపట్టారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదం అయింది. దాంతో, అప్పట్లో కూల్చివేతలను ఆపేశారు. అప్పుడు కూల్చివేతల తర్వాత మిగిలిపోయిన వాటిని ఈరోజు కూల్చేస్తున్నారు. 

More Telugu News