China: అమ్మాయిలను వద్దన్నారని.. అబ్బాయిలతోనే లోదుస్తుల యాడ్స్!

China Banned Woman From Modelling Lingerie Men Are Doing This

  • లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకుండా చైనా నిషేధం
  • ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిన చైనా
  • అబ్బాయిలతోనే లింగేరి మోడలింగ్
  • వెల్లువెత్తుతున్న కామెంట్లు

లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించడం వల్ల అశ్లీలత పెచ్చుమీరుతోందన్న కారణంతో చైనా ప్రభుత్వం ఆయా ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకుండా నిషేధం విధించింది. అంతేకాదు, ఆన్‌లైన్ ప్రచారాలకు మహిళలను ఉపయోగించకుండా ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దీంతో లోదుస్తుల ప్రచారం ఎలా చేయాలో తెలియక దిగాలు పడిపోయి నష్టాలు మూటగట్టుకున్న ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు తాజాగా సరికొత్త ఐడియాతో ముందుకొచ్చేశాయి. 

అమ్మాయిల స్థానంలో అబ్బాయిలతో లోదుస్తులకు సంబంధించిన యాడ్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. షేక్‌స్పియర్ కాలంలోనూ ఇలాగే ఉండేదని, అప్పట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతి లేదని కొందరంటే.. అప్పట్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరించేవారని మరో యూజర్ రాసుకొచ్చాడు.

More Telugu News