Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం.. ముఖేశ్ అంబానీని ఆప్యాయంగా హత్తుకున్న జగన్

Global Investors Summit Updates

  • జ్యోతిని వెలిగించి సమ్మిట్ ను ప్రారంభించిన జగన్
  • ప్రారంభోపన్యాసం చేసిన చీఫ్ సెక్రటరీ
  • పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్న గుడివాడ అమర్ నాథ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో ప్రారంభమయింది. సమ్మిట్ లో తొలుత రాష్ట్ర గీతం 'మా తెలుగు తల్లికి' గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, ఇన్ఫోటెక్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు ముఖేశ్ అంబానీని జగన్ ఆప్యాయంగా హత్తుకోవడం అందరినీ ఆకర్షించింది.

జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రసంగించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ జగన్ పాలన సాగుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని చెప్పారు. 

ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ... రాష్ట్రంలో పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉందని అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదని చెప్పారు.

Global Investors Summit
Andhra Pradesh
Jagan
YSRCP
Mukesh Ambani

More Telugu News