Kethika Sharma: మెగా మేనల్లుడి జోడీగా మెరవనున్న కేతిక శర్మ!

Kethika in Saitej Movie

  • సముద్రఖని దర్శకత్వంలో చేస్తున్న సాయితేజ్ 
  • కీలకమైన పాత్రను చేస్తున్న పవన్ కల్యాణ్
  • ఇటీవలే మొదలైన రెగ్యులర్ షూటింగు  
  • కథానాయికలుగా కేతిక - ప్రియా వారియర్

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ లో గ్లామర్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలా ఆయన స్కూల్ నుంచి వచ్చిన బ్యూటీనే కేతిక శర్మ. ఆకాశ్ పూరి జోడీగా 'రొమాంటిక్' సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. హాట్ లుక్స్ తోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. 

అయితే ఆ సినిమాతో పాటు ఆ తరువాత ఆమె చేసిన 'లక్ష్య' .. ' రంగరంగ వైభవంగా' సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో సహజంగానే ఆమె కాస్త వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో.. ఈ బొద్దు భామకు ఛాన్సులు రావాలనే కుర్రాళ్ల కోరిక ఫలించి, ఆమె మరో సినిమాలో ఆఫర్ ను దక్కించుకుంది. 

పవన్ - సాయితేజ్ కాంబినేషన్లో సముద్రఖని ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఇందులో సాయితేజ్ జోడీగా కేతిక శర్మను ఎంపిక చేశారని అంటున్నారు. ఇక మరో ముఖ్యమైన పాత్రలో ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా సందడి చేయనుందని చెబుతున్నారు.

Kethika Sharma
Saitej
Pavan Kalyan
Priya Prakash
  • Loading...

More Telugu News