Kakani Govardhan Reddy: పవన్ కల్యాణ్ ను, జనసేనను మేము గుర్తించడం లేదు: ఏపీ మంత్రి కాకాణి

We are not recognising Pawan Kalyan says Kakani

  • తోలుబొమ్మలాటలో పవన్ ఒక జోకర్ అన్న కాకాణి
  • కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే వారి పని అని విమర్శ
  • చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే వారి పని అని ఎద్దేవా చేశారు. తోలుబొమ్మలాటలో పవన్ ఒక జోకర్ మాత్రమేనని అన్నారు. వపన్ ను, జనసేన పార్టీని తాము అసలు గుర్తించడం లేదని చెప్పారు. రైతులకు మాండూస్ తుపాను నష్టపరిహారంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ సాయాన్ని అందించామని తెలిపారు. రైతులకు తమ ప్రభుత్వం ఎంతో చేస్తున్నప్పటికీ... కాకి లెక్కలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. 

175 స్థానాల్లో పోటీ చేస్తారా? అని ముఖ్యమంత్రి జగన్ విసిరిన సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబు నీతి, నిజాయతీ లేని వ్యక్తి అని, దుర్మార్గుడని అన్నారు. బాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు జనాలు రావడం లేదని... పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు.

Kakani Govardhan Reddy
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News