Twitter: భారత్ సహా పలు దేశాల్లో డౌన్ అయిన ట్విట్టర్

Twitter down in many countries uncluding India

  • యూఎస్, జపాన్, బ్రిటన్ సహా పలు దేశాల్లో సమస్యలు
  • యూజర్లకు లోడ్ కాని పేజీలు
  • విమర్శలు గుప్పిస్తున్న యూజర్లు

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవలి కాలంలో పలుమార్లు సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ మరోసారి మొరాయించింది. ఇండియా, బ్రిటన్, జపాన్, అమెరికా సహా అనేక దేశాల్లో యూజర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. యూజర్లకు పేజీలు లోడ్ కాలేదు. ఎర్రర్ మెసేజ్ కనిపించింది. కాసేపటి తర్వాత మళ్లీ సరిగా పని చేయడం ప్రారంభించింది. మరోవైపు ట్విట్టర్ కు ఏమైందంటూ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. తరచుగా సమస్యలు తలెత్తుతుండటంపై విమర్శలు కురిపిస్తున్నారు.

Twitter
Server
Down
  • Loading...

More Telugu News