Congress: రాహుల్ గాంధీ కొత్త లుక్.. ఫొటోలు వైరల్

Rahul Gandhi has a new look for Cambridge talk

  • భారత్ జోడో యాత్రలో గుబురు గడ్డంతో కనిపించిన రాహుల్
  • తాజాగా హెయిర్ కట్, గడ్డం, మీసాలు ట్రిమ్ చేసుకున్న కాంగ్రెస్ అగ్రనేత
  • సూటు ధరించి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కనిపించిన రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన లుక్ మార్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు  భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్.. కాస్త పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించారు. తాజాగా హెయిర్ కట్ తో పాటు గడ్డం మీసాలు కత్తిరించుకున్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ బ్రిటన్ చేరుకున్న ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఈ కొత్త లుక్ లో కనిపించారు. 

సాధారణంగా క్లీన్ షేవ్ చేసుకునే ఆయన కొంచెం మీసాలు, గడ్డం ఉంచుకోవడంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో తెల్లటి టీషర్ట్, ప్యాంట్ నే ధరించిన ఆయన ఇప్పుడు సూట్ ధరించి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం అనే అంశంపై ఆయన ప్రసంగిస్తారని యూత్ కాంగ్రెస్ ఇచ్చిన ట్వీట్‌లో తెలిపింది. రాహుల్ కొత్త లుక్ ను షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Congress
Rahul Gandhi
new look
Cambridge
London

More Telugu News