Kamal Haasan: 'ఇండియన్ 2'పై క్లారిటీ ఇచ్చిన వెన్నెల కిశోర్!

Indian 2 movie update

  • షూటింగు దశలో 'ఇండియన్ 2'
  • చకచకా కానిచ్చేస్తున్న శంకర్ 
  • వెన్నెల కిశోర్ జాయిన్ కానున్నట్టు వార్తలు 
  • తాను ఈ సినిమాలోనే లేనని చెప్పిన కిశోర్

వెన్నెల కిశోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వరుస సినిమాలతో ఆయన ఫుల్ బిజీ. ఇప్పుడు ఆయన డేట్స్ దొరకడమే కష్టం. అలాంటి వెన్నెల కిశోర్ 'ఇండియన్ 2' సినిమా చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం 'ఇండియన్ 2' షూటింగు చకచకా జరుగుతోంది. లైకా - రెడ్ జెయింట్ సంస్ధలు కలిసి ఈ సినిమాను భారీ బాడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. కాజల్ .. రకుల్ కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అలాంటి ఈ సినిమాలో వెన్నెల కిశోర్ పాత్ర కూడా కీలకం కానుందనీ, రేపో మాపో ఈ సినిమా షూటింగులో ఆయన పాల్గొంటాడనే టాక్ వినిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఈ విషయంపై వెన్నెల కిశోర్ స్పందించాడు. ఈ సినిమాలో తాను కూడా భాగమైనట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. తాను 'ఇండియన్ 2'లో గానీ ..  'పాకిస్థాన్ 3'లో గాని లేనంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సరదాగానే ఆయన ఈ ప్రచారానికి తెరదించడం విశేషం. 

Kamal Haasan
Kajal Agarwal
Rakul Preet Singh
  • Loading...

More Telugu News