Upasana: ఉపాసన డెలివరీ ఎక్కడన్నదానిపై క్లారిటీ వచ్చేసింది!

Upasana delivery is in Hyderabad

  • త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న ఉపాసన
  • హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలోనే డెలివరీ
  • డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తానన్న అమెరికా డాక్టర్ జెన్నిఫర్

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మరోవైపు రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. యూఎస్ లో పాప్యులర్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నాడు. ఈ షోలో ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. చరణ్ తో జెన్నిఫర్ మాట్లాడుతూ.... మీ ఫస్ట్ బేబీకి డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. 

ఈ వ్యాఖ్యలపై ఉపాసన స్పందిస్తూ... డాక్టర్ జెన్నిఫర్ మీ మాటలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు. మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నానని.. తమ బేబీకి డెలివరీ చేసేందుకు అపోలో హాస్పిటల్స్ లోని డాక్టర్ సుమన, డాక్టర్ రూమ సిన్హాలతో కలవాలని కోరారు. దీనికి సమాధానంగా... తనకు కూడా రావాలనే ఉందని డాక్టర్ జెన్నిఫర్ అన్నారు. ఇంకోవైపు, ఉపాసన అమెరికాలో డెలివరీ చేయించుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఉపాసన వ్యాఖ్యలతో డెలివరీ ఇక్కడే జరగనుందనే విషయం స్పష్టమయింది.

Upasana
Ramcharan
Delivery
Tollywood
  • Loading...

More Telugu News