Pavan Kalyan: సాయితేజ్ కోసం 'విరూపాక్ష'పై కేర్ తీసుకుంటున్న పవన్!

Virupaksha Movie Update

  • సాయితేజ్ కెరియర్లో వచ్చిన గ్యాప్
  • త్వరలో 'విరూపాక్ష'గా ఆడియన్స్ ముందుకు
  • తమిళ రీమేకులోను దక్కిన ఛాన్స్ 
  • ఆయన కెరియర్ పై దృష్టి పెట్టిన పవన్

సాయితేజ్ తన కెరియర్ విషయంలో తన మేనమామలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారనే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. హీరోగా తనని తాను మలచుకోవడానికి అవసరమైన టిప్స్ ను చిన్నమామయ్య చెబుతూ వచ్చాడనే విషయాన్ని రీసెంట్ గా 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై కూడా చెప్పాడు. 

సాయితేజ్ కి ఆ మధ్య జరిగిన యాక్సిడెంట్ వలన, ఆయన కాస్త గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. ఈ మధ్యలోనే చాలామంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందువలన సాయితేజ్ మరింత కష్టపడవలసి ఉంది. అతనికి తగిన ఊతాన్ని ఇవ్వడానికి గాను పవన్ తనవంతు ప్రయత్నాన్ని చేస్తున్నాడని అంటున్నారు. 

సాయితేజ్ తాజా చిత్రమైన 'విరూపాక్ష' చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందనేది పవన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే వస్తున్నాడట. అంతేకాదు తన తాజా చిత్రమైన 'వినోదయ సితం' రీమేకులోను సాయితేజ్ ఉండేలా చూసుకున్నాడు. ఒక వైపున రాజకీయాలు .. మరో వైపున తన సినిమాలను చక్కబెడుతూనే, మేనల్లుడి కెరియర్ పై కూడా పవన్ దృష్టి పెట్టడం విశేషమే.

Pavan Kalyan
Sai Dharam Tej
Virupaksha Movie
  • Loading...

More Telugu News