Rajasri: కాంచనమాలను అలా చూసి షాక్ అయ్యాను: అలనాటి తార రాజశ్రీ

Rajasri Interview

  • తెలుగు తెరపై అందాల రాకుమారి రాజశ్రీ 
  • జానపదాలలో ఎక్కువగా నటించిన నాయిక 
  • కాంతారావు జోడీగా మెప్పించిన వైనం 
  • కాంచనమాలను గురించిన ప్రస్తావన

రాజశ్రీ నవ్వితే రత్నాలు రాలినట్టుగా ఉంటుందని అప్పట్లో చెప్పుకునేవారు. ఆమె నవ్వు అంత సమ్మోహనంగా ఉండేది. ఆమె ఎక్కువగా జానపద సినిమాలలో చేయడం వలన, ఆమెను తెలుగు తెర యువరాణిగా పిలుచుకునేవారు. కాంతారావుతో ఆమె చేసిన సినిమాలు ఎక్కువ. తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నా చిన్నప్పుడు నాకు కాంచనమాల అంటే ఎంతో ఇష్టం. ఆమె గ్లామర్ చూసి నేను ఆశ్చర్యపోతుండే దానిని. ఎప్పటికైనా ఆమెను చూడాలని అనుకుంటూ ఉండేదానిని. అలాంటి కాంచనమాలను ఒక సినిమా షూటింగులో చూశాను. ఆమె వస్తున్నారని తెలిసి .. ఎప్పుడెప్పుడు ఆమెను చూస్తానా అని అక్కడ ఎదురుచూస్తూ వున్నాను.  

ఆ తరువాత కొంత సేపటికి కాంచనమాలను అక్కడికి తీసుకుని వచ్చారు. ఆమె కాంచనమాల అంటే నేను నమ్మలేకపోయాను. అంతగా ఆమె మారిపోయింది. అప్పటికే ఆమె మానసిక స్థితి దెబ్బతిందని చెప్పారు. ఆమెను చూడటమే అదృష్టమనుకోవాలా? లేదంటే అలా చూడవలసి వచ్చినందుకు బాధపడాలా? అనేది నాకు అర్థం కాలేదు" అని చెప్పుకొచ్చారు. 

Rajasri
Kanchaanamala
Tollywood
  • Loading...

More Telugu News