Chikoti Praveen: రూ. 3 కోట్ల కారు విషయంలో చికోటి ప్రవీణ్ కు ఐటీ నోటీసులు

IT notices to Chikoti Praveen in Rs 3 Cr car case
  • భాటియా ఫర్నిచర్ పేరుతో కారు కొనుగోలు
  • కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు
  • ఇప్పటికే కేసినో వ్యవహారాల్లో విచారణను ఎదుర్కొంటున్న ప్రవీణ్
చికోటి ప్రవీణ్... క్యాసినో వ్యవహారాలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాప్యులర్ అయిన వ్యక్తి. తాజాగా ఆయనకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రూ. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో నోటీసులు పంపింది. భాటియా ఫర్నిచర్ పేరు మీద ఆయన కారును కొనుగోలు చేశారు. దీంతో, మీ కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ ఐటీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మరోవైపు కేసినో వ్యవహారాల్లో చికోటి ప్రవీణ్ ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయనపై ఫెమా కేసును నమోదు చేశారు.
Chikoti Praveen
Car
IT

More Telugu News