Kasturi: అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్ చక్కగా మాట్లాడారు... ట్రోలింగ్ సరికాదు: కస్తూరి

Kasturi came into support for Jr NTR

  • ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం
  • అమెరికన్ యాసలో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్
  • ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోలింగ్
  • ఎన్టీఆర్ ను మంచు లక్ష్మితో పోల్చుతున్న నెటిజన్లు
  • ఖండించిన కస్తూరి

హాలీవుడ్ లో హంగామా సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ వేదికపైనా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంగ్లీషులో ప్రసంగించగా, ఆయన యాసపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ ది ఫేక్ యాక్సెంట్ అంటూ, ఆయనను మంచు లక్ష్మితో పోల్చడం మొదలుపెట్టారు. 

దీనిపై దక్షిణాది నటి కస్తూరి స్పందించారు. గోల్డెన్ గ్లోబ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ చక్కగా మాట్లాడారని, ఆయనపై ట్రోలింగ్ సరికాదని హితవు పలికారు. అమెరికన్లకు అక్కడి యాసలో మాట్లాడితేనే అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ చేసింది అదేనని, అందులో తప్పుబట్టడానికేమీ లేదని తెలిపారు. 

తాను కొంతకాలం అమెరికాలో ఉన్నానని, అక్కడిక వారికి ఎలాంటి యాసలో మాట్లాడితే అర్థమవుతుందో తనకు తెలుసని కస్తూరి వెల్లడించారు. అయితే, అది అమెరికాలో మాత్రమే వర్తిస్తుందని, మనదేశానికి వచ్చి అమెరికన్ యాసతో తెలుగు మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను మంచు లక్ష్మితో పోల్చవద్దని పేర్కొన్నారు.

More Telugu News