Nayanatara: కొంతకాలం పాటు యాక్టింగ్ కి దూరంగా నయన్!

Nayanatara Special

  • స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన నయనతార 
  • సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చిన వైనం 
  • ప్రస్తుతం 'జవాన్' షూటింగులో బిజీ 
  • ఇక పిల్లల ఆలనా పాలనపైనే శ్రద్ధ


నయనతార అందగత్తె మాత్రమే కాదు .. అదృష్టవంతురాలు కూడా. కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తనకి ఏ కథ నచ్చితే ఆ కథను చేసుకుంటూ వెళ్లింది. ఆమె ఏ పాత్రను పోషించినా, అభిమానులు ఆదరిస్తూ వెళ్లారు. ఇంతవరకూ అక్కడ ఆమెను ఇతర హీరోయిన్స్ బీట్ చేయలేకపోయారు. 

అలాంటి నయనతార కొంతకాలం పాటు నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసిన తరువాత, కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెడుతుందని అంటున్నారు. పిల్లల ఆలనా పాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. 

అంతే కాదు .. ఇదే సమయంలో సొంత నిర్మాణ సంస్థపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం నయనతార బాలీవుడ్లో అట్లీ కుమార్ దర్శకత్వంలో 'జవాన్' చేస్తోంది. షారుక్ ఖాన్ .. విజయ్ సేతుపతితో కలిసి ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. జూన్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

Nayanatara
Actress
Kollywood
  • Loading...

More Telugu News