Rana Daggubati: నా గురించి ఆ మాట చెప్పింది రానా ఒక్కడే: నాని

Nijam Talk Show

  • 'నిజం' టాక్ షోలో రానా - నాని
  • తన సినిమాల గురించి నాని ప్రస్తావన 
  • రానా పట్ల అలా అభిమానం ఏర్పడిందని వ్యాఖ్య 
  • కలిసి నటించాలని ఉందని వెల్లడి

సోని లివ్ లో 'నిజం' టాక్ షోకి సంబంధించిన 3వ ఎపిసోడ్ ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో రానా - నాని పాల్గొన్నారు. రానాతో తనకి గల అనుబంధాన్ని గురించి నాని స్పందిస్తూ .. "'అష్టాచమ్మా ' సినిమా చేసేటప్పుడు నా సినిమా ఎవరు చూస్తారా అనుకునేవాడిని. అలా మూడు .. నాలుగు సినిమాలు చేశాను. ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీలలో నాకు ఎవరూ తెలియదు" అన్నాడు. 

"నా సినిమాల గురించిగానీ .. నా నటన గురించి గాని ఎవరూ మాట్లాడేవారు కాదు. దాంతో నా సినిమాలను ఎవరూ చూడటం లేదేమో అనుకున్నాను. కానీ ఒక మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా నా గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారిలో ఎవరిపై బెట్ పెడతారనే ప్రశ్నకి ఆయన నా పేరు చెప్పాడు" అని అన్నాడు. 

"ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నా గురించి అలా మాట్లాడటం అదే ఫస్టు టైమ్. అప్పటికి నేను బయట రానాను చూడలేదు. కానీ ఆయన పట్ల అభిమానం పెరిగిపోయింది. మేమిద్దరం కలుసుకున్న తరువాత మా మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. మేము కలిసి నటించాలనే కోరిక ఉంది. ఆ విషయాన్ని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. అందుకు అన్నీ కలిసి రావాలి" అంటూ చెప్పుకొచ్చాడు.

Rana Daggubati
Nani
Smitha
Nijam Talk Show
  • Loading...

More Telugu News