Krithi Shetty: కృతి శెట్టి జోరు తగ్గిందా? దూకుడు తగ్గించిందా?

Krithi Shetty Special

  • 'ఉప్పెన'లా దూసుకొచ్చిన బ్యూటీ
  • వరుస ఫ్లాపులతో సతమతం 
  • చేతిలో ఉన్న సినిమా 'కస్టడీ ' మాత్రమే 
  • కంటెంట్ ఉన్న కథల కోసమే వెయిటింగ్

టాలీవుడ్ కుర్రకారు మనసులను ఒక రేంజ్ లో దోచేసిన కథానాయికగా కృతి శెట్టి కనిపిస్తుంది. తొలి సినిమా 'ఉప్పెన'తోనే ఈ సుందరి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను కూడా బంతిపువ్వులాంటి ఈ బ్యూటీ మంచి మార్కులు కొట్టేసింది. తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. 

అయితే ఆ తరువాత అంతే స్పీడ్ తో మూడు ఫ్లాపులు కూడా మూటగట్టేసింది. ఇక అప్పటి నుంచి ఆమె కొత్త ప్రాజెక్టులలో పెద్దగా కనిపించడం లేదు. చైతూ జోడీగా చేస్తున్న 'కస్టడీ' తప్ప మరో సినిమాలో ఆమె ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. గతంలో మాదిరిగా కృతి గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఆమె జోరు తగ్గిందా? ఆమెనే దూకుడును తగ్గించిందా? అనేదే ప్రశ్న. 

వరుస ఫ్లాపులు పడినప్పుడు అవకాశాలు తగ్గడం .. మంచి ప్రాజెక్టు అయితేనే చేద్దాంలే అనుకుని దూకుడు తగ్గించడం సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె మంచి ప్రాజెక్టులను ఎంచుకోవలసిన అవసరం ఉంది. తన హవాను కొనసాగించడానికి అవసరమైనంత సమయం .. గ్లామర్ ఉంది. పోటీకి దిగే కొత్త భామల సంఖ్య పెరిగేలోగా, కృతి టాప్ హీరోయిన్స్ రేసులోకి ఎంట్రీ ఇవ్వకపోతే కష్టమే మరి.

Krithi Shetty
Nagachaitanya
Tollywood
  • Loading...

More Telugu News