Avanthi Srinivas: విశాఖలో మాజీ మంత్రి అవంతికి అవమానం

Insult to Avanthi Srinivas

  • మధురవాడలో ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం ఏర్పాటు
  • ఫ్లెక్సీపై కనిపించని అవంతి ఫొటో
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అవంతి అనుచరులు

వైసీపీ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు అవమానం జరిగింది. విశాఖలోని మధురవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమయింది. ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అవంతి ఫొటో లేకపోవడమే వివాదానికి కారణం. దీనిపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీపై అవంతి ఫొటోను ఎందుకు వేయలేదని మండిపడ్డారు. దీంతో, అప్పటికప్పుడు ఫ్లెక్సీపై అవంతి ఫొటో స్టిక్కర్ ను అతికించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Avanthi Srinivas
Vizag
YSRCP
  • Loading...

More Telugu News