Sourav Ganguly: బాలీవుడ్ లో సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో ఎవరంటే..?

Ganguly Boipic

  • ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన కపిల్, సచిన్, ధోనీల బయోపిక్ లు
  • గంగూలీ బయోపిక్ తెరకెక్కబోతోందంటూ బీటౌన్ టాక్
  • గంగూలీ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్నాడని వార్తలు

ఇప్పటికే పలువురు క్రికెటర్ల బయోపిక్ లు ఘన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్, టెండూల్కర్, ధోనీ తదితరుల బయోపిక్ లు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కేందుకు రెడీగా ఉందని బీటౌన్ టాక్. 

ఇక ఈ చిత్రంలో గంగూలీ పాత్రను బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి వెల్లడించారు. ఈ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే పలు మార్లు సిట్టింగులు జరిగినప్పటికీ రణబీర్ డేట్లు కుదరకపోవడంతో అప్పట్లో డీల్ కుదరలేదని... ఇప్పుడు డేట్లు కుదరడంలో డీల్ ఓకే అయిందని ఆయన చెప్పారు. గంగూలీ నుంచి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్శకుడితో కలిసి రణబీర్ త్వరలోనే కోల్ కతాకు వెళ్తున్నారని చెప్పారు. అయితే, ఈ చిత్ర దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Sourav Ganguly
Biopic
Bollywood
Ranbir Kapoor
  • Loading...

More Telugu News