Andhra Pradesh: కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యకేసు ప్రధాన నిందితుడి అరెస్ట్

Maoist Sunil who killed kidari sarveswara rao arrested

  • 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య
  • ఏవోబీలో జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులకు చిక్కిన రైనో
  • ఏపీ, ఒడిశా పోలీసులకు రైనో మోస్ట్ వాంటెడ్

2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మావోయిస్టు నేత జనుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సునీల్ తమకు చిక్కినట్టు సీలేరు పోలీసులు తెలిపారు. 

నిందితుడి నుంచి ఐఈడీ, తుపాకి, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ ప్రత్యేక జోన్ డివిజినల్ కమిటీ సభ్యుడిగా ఉన్న రైనో ఏవోబీలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఏపీ, ఓడిశా పోలీసులకు ఆయన మోస్ట్‌ వాంటెడ్ మావోయిస్టు అని చెప్పారు. కాగా, రైనోపై గత ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల రివార్డు కూడా ఉంది.

  • Loading...

More Telugu News