Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేజారిన హిట్ సినిమాలివే!

Vijay Devarakonda Special

  • విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ 
  • డేట్స్ కుదరక వదులుకున్న సినిమాలు హిట్ 
  • ఆ జాబితాలో కనిపిస్తున్న 'సీతా రామం'
  • దాదాపు 100 కోట్లను రాబట్టిన సినిమా అది

సాధారణంగా దర్శకులు కథలను రెడీ చేసుకుని, ఆ కథను ఎవరు చేస్తే బాగుంటుందనే విషయాల్లో ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ హీరోకి ఆ కథను వినిపిస్తారు. అయితే కథలు నచ్చకపోవడం వలన .. ఒకవేళ నచ్చినా, ఆల్రెడీ కమిటైనవి పూర్తిచేయాలి గనుక 'నో' చెప్పేస్తూ ఉంటారు. అలా ఒక హీరో కాదన్న కథ మరో హీరో దగ్గరికి వెళ్లడం .. ఆ హీరో చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరుగుతూ ఉంటుంది. 

అలా తమ చేయి జారిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నప్పుడు, 'అయ్యో చేసి ఉంటే బాగుండేదే' అనుకుంటూ ఫీల్ కావడం సహజం. అలా విజయ్ దేవరకొండ చేజారిన సినిమాలు కూడా చాలానే కనిపిస్తాయి. ఆ జాబితాలో 'ఉప్పెన' .. 'ఆర్ ఎక్స్ 100' సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. 'ఉప్పెన' సినిమాను వైష్ణవ్ తేజ్ చేయడానికి కొన్ని ఏళ్ల క్రితమే ఆ కథను విజయ్ దేవరకొండ విన్నాడట.

ఇక వెంకీ కుడుముల 'భీష్మ' .. పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' .. దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' కథలు ముందుగా విజయ్ దేవరకొండ దగ్గరికే వచ్చాయట. డేట్స్ కుదరకపోవడం వలన ఆయన చేయలేదని సమాచారం. ఈ మూడు సినిమాలు కూడా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలను విజయ్ దేవరకొండ చేసుంటే, ఆయన గ్రాఫ్ ఒక రేంజ్ లో ఉండి ఉండేది. 

Vijay Devarakonda
Venky Kudumula
Puri Jagannadh
Hanu Raghvapudi
  • Loading...

More Telugu News