Team India: ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించిన టీమిండియా ఆటగాళ్లు

Team India visits Prime Ministers Sangrahalaya

  • ఢిల్లీ టెస్టును రెండున్నర రోజుల్లోనే ముగించిన భారత్
  • మిగిలిన సమయంలో దేశ రాజధాని పర్యటన
  • సంగ్రహాలయలో వివిధ వస్తువులను పరిశీలించిన ఆటగాళ్లు

ఆస్ట్రేలియా జట్టును ఢిల్లీ టెస్టులో రెండున్నర రోజుల్లోనే మట్టికరిపించిన టీమిండియా... మిగిలిన సమయంలో దేశ రాజధానిలో పలు ప్రాంతాలను సందర్శిస్తోంది. తాజాగా, టీమిండియా ఆటగాళ్లు ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయకు తరలి వెళ్లారు. భారత ప్రధానమంత్రులు ఉపయోగించిన వివిధ వస్తువులను, వారి విలువైన సందేశాలను ఈ సంగ్రహాలయలో భద్రపరిచారు. 

సంగ్రహాలయకు విచ్చేసిన సందర్భంగా భారత ఆటగాళ్లను కేంద్రం సత్కరించింది. ఈ విశిష్ట సంగ్రహాలయాన్ని సందర్శించడం ఒక అరుదైన అవకాశం అని భారత ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. 

టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితర ఆటగాళ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

కాగా, ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1న ఇండోర్ లో ప్రారంభం కానుంది.

Team India
Prime Ministers Sangrahalaya
New Delhi
Australia

More Telugu News