Roja Ramani: చంద్రమోహన్ గారు ఇలాంటి పనులే చేసేవారు: నటి రోజారమణి

Roja Ramani Interview

  • చంద్రమోహన్ జోడీగా చేసిన రోజా రమణి 
  • ఆయన చాలా సరదా మనిషని వ్యాఖ్య
  • రోజుకు నాలుగు షూటింగులు చేసేవారని వెల్లడి 
  • అలా మస్కా కొట్టేవారని నవ్విన రోజా రమణి   

బాలనటిగా 'భక్త ప్రహ్లాద' .. హీరోయిన్ గా 'ఓ సీతకథ' సినిమాలు రోజారమణి కెరియర్లో మైలురాళ్లుగా కనిపిస్తాయి. అలాంటి రోజారమణి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రమోహన్ గురించి ప్రస్తావించారు. చంద్రమోహన్ గారి జోడీగా నేను ఒక ఎనిమిది .. తొమ్మిది సినిమాలు చేశాను. ఆయన సెట్లో ఉన్నారంటే సరదా .. సందడి. రోజుకి నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేవారు" అన్నారు. 

"ఒకసారి ఆయన లొకేషన్లో దేని గురించో వెతుకుతున్నారు. ఏం పోయిందండి అని నేను అడిగాను. నెక్స్ట్ షాట్ కి కావలసిన 'మీసం' ఎక్కడో పడిపోయింది అన్నారు. గాలికి కొట్టుకుపోతే దొరకడం కష్టమని భావించి అక్కడున్న వాళ్లమంతా కలిసి దాని కోసం వెతకడం మొదలుపెట్టాము. కాసేపటి తరువాత ఆయన కనిపించలేదు. అయినా మేము దానికోసం వెతకడం ఆపలేదు" అని చెప్పారు. 

" ఓ రెండు గంటల తరువాత చంద్రమోహన్ గారు వచ్చారు. ఎంతవరకూ వచ్చింది అని అడిగారు. నాకు సంబంధించిన కొన్ని షాట్స్ తీశారని చెప్పాను. అందుకు ఆయన నవ్వుతూ 'మీసం ఎక్కడికీ పోలేదు .. నా జేబులోనే ఉంది' అన్నారు. అంటే మీసం కోసం మేమంతా వెతికేలోగా ఆయన ఆ పక్కనే మరో సినిమాకి సంబంధించిన షాట్ ను పూర్తిచేసి వచ్చేశారన్న మాట" అంటూ నవ్వేశారు. 

Roja Ramani
Chandra Mohan
Tollywood
  • Loading...

More Telugu News